దేవరకొండ మునగాల కొండలరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ‘సాధన ఫెస్ట్ ఆఫ్ క్రియేటివిటీ-2026.

తేది:08-01-2026 TSLAWNEWS నల్గొండ జిల్లా కోఆర్డినేటర్ వనమాల రమేష్.

నల్గొండ జిల్లా,దేవరకొండ : మునగాల కొండలరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్), దేవరకొండలో గురువారం అనగా 8/1/ 2026 రోజున సాధన ఫెస్ట్ ఆఫ్క్రియేటివిటీ-2026 అనే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దేవరకొండ డివిజన్లోని 24 ప్రభుత్వ మరియు ప్రైవేటు కళాశాలల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. సోలో డాన్స్, గ్రూప్ డాన్స్, సోలో సింగింగ్, గ్రూప్ సింగింగ్ , సైన్స్ ఎగ్జిబిషన్, బిజినెస్ క్విజ్ రంగోలి, జస్ట్ ఎ మినిట్, ఎలక్యూషన్ విభాగాలలో పోటీలనునిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులతో పాటు ప్రశంస పత్రాలను అందించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రమావత్ రవి మాట్లాడుతూ విద్యార్థులలోని సృజనాత్మకత శక్తిని వెలికి తీయడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ఇందుకు సహకరించిన దేవరకొండ డివిజన్లోని జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ మరియు అధ్యాపక బృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గెలుపొందిన విద్యార్థులకు అందించిన బహుమతుల దాతలు – ఎల్ఐసి& లైన్స్ క్లబ్ దేవరకొండ& సహస్ర. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథి శ్రీ ఎస్ రాము చౌహన్ సీనియర్ బ్రాంచ్ మేనేజర్ ఎల్ఐసి దేవరకొండ, అలుమ్ని సెక్రటరీ లయన్ డాక్టర్ కే మల్లికార్జున్, లయన్స్ క్లబ్ జోనల్ చైర్మన్ లయన్ వనం శ్రీనివాస్, లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ నల్లమల నారాయణరెడ్డి, లయన్స్ క్లబ్ జనరల్ సెక్రటరీ లయన్ లకుమారపు మల్లయ్య,జూనియర్ కళాశాల ప్రిన్సిపల్స్ మరియు అధ్యాపకులు, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ జి .కోటయ్య, సాధన ఫెస్ట్ ఆఫ్ క్రియేటివిటీ – 2026 ఆర్గనైజింగ్ కోఆర్డినేటర్ సి.లింగమయ్య, సిఓఈ జి .లింగారెడ్డి , ఐ క్యూ ఏసి కోఆర్డినేటర్ డాక్టర్ కె పృథు, డాక్టర్ ఎం. ప్రభాకర్, డాక్టర్ కే రేణుక, డాక్టర్ వి మకట్లాల్, తదితర అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *