మోడల్ స్కూల్ విద్యార్థుల విజ్ఞాన విహార యాత్ర.

తేది:08-01-2026 TSLAWNEWS నల్గొండ జిల్లా కోఆర్డినేటర్ వనమాల రమేష్.

నల్లగొండ జిల్లా,దేవరకొండ: నేరడుగొమ్ము మండల కేంద్రంలో ఉన్న ఆదర్శ పాఠశాల విద్యార్థులు బుధవారం పీఎం శ్రీ లో భాగంగా ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ విజిట్( విజ్ఞాన విహార యాత్ర) కోసం పదవ తరగతి,ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఒకేషనల్ విద్యార్థులను మాల్ పట్టణంలోని మీ మార్ట్ కి తీసుకు వెళ్ళడం జరిగింది.ఈ యొక్క మార్ట్ ని సందర్శించడం వల్ల విద్యార్థుల్లో వృత్తి విద్యానైపుణ్యాలు మెరుగుపడతాయి,ఇది పిల్లల భవిష్యత్తుకు తోడుపడుతుందని ఒకేషనల్ ట్రైనర్ బెజవాడ శంకరయ్య అన్నారు.సందర్శనకు సహకరించిన మీ మార్ట్ యాజమాన్యానికి,సిబ్బందికి ధన్యవాదములు తెలిపారు.ఈ యొక్క కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ కోటేష్ నాయక్, ట్రైనర్ శంకరయ్య,పిడి శ్రీను నాయక్,ఉపాధ్యాయులు శేఖర్ రాంకుమార్,శేఖర్,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *