తేది:08-01-2026 భూపాలపల్లి జిల్లా TSLAWNEWS గణపురం మండలం రిపోర్టర్ దీపక్ పటేల్ పుప్పాల.
భూపాలపల్లి జిల్లా: గణపురం మండలం చెల్పూర్ మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఎంజీఎం పాఠశాలలో 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను గురువారం ఘనంగా ఆవిష్కరించారు. పాఠశాల విద్యార్థిని, విద్యార్థుల ముఖచిత్రాలతో ముద్రించబడిన క్యాలెండర్లను పాఠశాల కరస్పాండెంట్ గ్యాదంగి సతీష్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ క్యాలెండర్ ద్వారా పాఠశాలలో జరిగే వివిధ విద్యా కార్యక్రమాలు, పరీక్షల తేదీలు, సెలవులు, వివిధ సహా పాఠ్య కార్యక్రమాల వివరాలు విద్యార్థులకు, తల్లిదండ్రులకు సులభంగా తెలియజేయబడతాయని తద్వారా విద్యార్థుల్లో నిర్దిష్ట క్రమశిక్షణ, సమయపాలన అలవడుతుందని అంతేకాకుండా విద్యాసంవత్సరంలో ఎటువంటి ఒత్తిడి లేకుండా విద్యార్థుల సమయ నిర్వహణకు ఎంతో ఉపయోగమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు గ్యాదంగి తిరుపతి, గ్యాదంగి రమాదేవి, సిలువేరు శ్రీనివాస్, ప్రిన్సిపల్ మధుకర్ ఉపాధ్యాయిని,ఉపాధ్యాయులు విద్యార్థులు ,తల్లిదండ్రులు పాల్గొన్నారు.