తేది:08-01-2026 భూపాలపల్లి జిల్లా TSLAW NEWS గణపురం మండలం రిపోర్టర్ దీపక్ పటేల్ పుప్పాల.
భూపాలపల్లి జిల్లా: గణపురం మండలం రాజ్యాధికారమే లక్ష్యంగా బీసీ ఎస్సీ ఎస్టీలు ముందడుగు వేయాలని
అన్ని రంగాల్లో పై చేయి సాధించాలని భూపాలపల్లి బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ పైడిపల్లి రమేష్ అన్నారు.గురువారం గణపురం బీసీ జేఏసీ చైర్మన్ బత్తిని శివశంకర్ గౌడ్ ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన బీసీ, ఎస్సీ, ఎస్టీ సర్పంచ్ లకు ఘనంగా సన్మానించారు. మొదట పూలే, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ పైడిపల్లి రమేష్ మాట్లాడుతూ ప్రజలు ఎంతో నమ్మకంతో గెలిపించారని వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక కృషి చేయాలని ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని ఈ సందర్భంగా అన్నారు. రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లో బీసీ ఎస్సీ ఎస్టీ ల ప్రాతినిధ్యం పెరగనుందని అందుకు అనుగుణంగా అన్ని సంఘాల నాయకులు పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా నూతనంగా గెలిచిన సర్పంచులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చెల్పూర్ సర్పంచ్ కావటి రజిత రవీందర్, బుద్ధారం సర్పంచ్ విడిదినేని శ్రీలత అశోక్, గాంధీనగర్ సర్పంచ్ ఇంజపెల్లి శ్రీనివాస్, బస్వరాజు పల్లి సర్పంచ్ చింతకుంట్ల సునీత శ్రీనివాస్, ధర్మారావుపేట సర్పంచ్ పూజారి రాజేందర్ గౌడ్, పరశురాంపల్లి సర్పంచ్ ఉడుత సాంబయ్య యాదవ్, మైలారం సర్పంచ్ భూక్య సమ్మయ్య, బుర్ర కాయలగూడెం సర్పంచ్ తుమ్మల సంపత్, ఓరుగంటి కృష్ణ గౌడ్ లను సన్మానించగా సన్మాన వేదికలో జేసీ జిల్లా కో కన్వీనర్ పోతర్ల మల్లికార్జున్ యాదవ్, కొత్త వెంకన్న ,మామిండ్ల మల్లికార్జున్ గౌడ్, వైనాల వెంకటేశ్వర్లు,