ఆర్టీసీ బస్సులొ సురక్షితంగా ప్రయాణించాలి కానీ ఫుట్ బోర్డ్ పై ప్రయాణం చెయ్యద్దుని మెదక్ ఆర్టీసీ డిపో మేనజర్ రేణుక సూచించారు.

తేది:8-1-2026 TSLAWNEWS మెదక్ జిల్లా , మెదక్ మండల రిపోర్టర్ శివలింగం ఎల్లం.

మెదక్ జిల్లా: ద్విచక్ర వాహన దారులు హెల్మెట్ తప్పనిసరి అని ఎంవి ఐ విజయలక్ష్మి, అన్నారు మెదక్ జిల్లా కేంద్రం లోని ఆర్టీసీ డిపో ముందు గురువారం రోజున రోడ్డు భద్రత వారోత్సవాల్లో రక్తదాన శిభిరంను నిర్వహించారు.ఈ శిబరంలొ ఆర్టీసీ డ్రెవర్లు కండక్టర్ లు, మెకానిక్ లు, రక్త దానం చేశారు.ఈ కార్యక్రమం లో మెదక్ బస్ డిపో మేనేజర్ తోపాటు సిబ్బంది డ్రైవర్లు, టెక్నీషియన్ లు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ విజయ లక్ష్మి వారి సిబ్బంది తో పాల్గొన్నారు. గత సంవత్సరం 41 మంది రక్త దానం చేయగా,ఈ సారి కూడా ఉదయం నుండి అధిక సంఖ్యలో రక్త దానం చేసారు అని ఆర్ టి సి డి ఎం రేణుక అన్నారు. ఈ సందర్బంగా డిపో మేనేజర్ మాట్లాడుతూ,
జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు జనవరి 1నుండి ఈ నెల 31 వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుంది అని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్ టి సి బస్సులో ప్రయాణికులు అధిక సంఖ్య లో వెళ్తున్నారని, బస్సు లో ప్రయాణించే ప్రయాణికులు ఫుట్ ప్రయాణం సరికాదని,ప్రమాదం జరిగే అవకాశం ఉందని, ప్రయాణికుల సురక్షిత ప్రయాణమే మా ద్వేయమని అన్నారు.ఈ సందర్బంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ విజయ లక్ష్మి మాట్లాడుతూ రోడ్డు పై ప్రయాణించేటప్పుడు బైకర్లు హెల్మెట్ ధరించి బైక్ ను నడుపాలని, మందు తాగి వాహనాలను నడుపవద్దని తెలియజేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *