కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించడంతో ఐటీ కారిడార్‌లో ఉన్న వందలాది ఐటీ కంపెనీలు తమ రోజువారి కార్యకలాపాలను ఆపివేశాయి. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోంకు అవకాశం కల్పించాయి. లక్షలాది మంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ఇప్పుడు కార్యాలయాలకు రావడం లేదు. వారంతా ఇప్పుడు ఇంటి నుంచే విధులు నిర్వహిస్తున్నారు. అయితే కంపెనీలలో కూర్చుని పరిమిత గంటల్లో పనిచేసే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ఇప్పుడు కొంత ఎక్కువగానే పని చేస్తున్నామని చెబుతున్నారు. తమ పనుల్లో ఎక్కడా జాప్యం జరగడం లేదని పేర్కొంటున్నారు. ఇంట్లోంచి పనిచేయడం కంటే ఆఫీసుల్లో పనిచేయడమే మేలని అభిప్రాయపడుతున్నారు.