తేది:8-1-2026, జనగామ జిల్లా, TSLAWNEWS, పాలకుర్తి మండల రిపోర్టర్ Maroju Bhaasker.
జనగామ జిల్లా: పాలకుర్తి మండలం ముత్తారం స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో సమగ్ర శిక్ష కాంట్రాక్టు ప్రాతిపదికన క్లస్టర్ రిసోర్స్ పర్సన్ గా విధులు నిర్వహిస్తున్న కొంతం సాంబయ్య గత నెల 21వ తేదీన హార్ట్ ఎటాక్ తో మృతి చెందడం జరిగింది. వారికి ప్రభుత్వం నుండి ఎటువంటి ఆర్థిక సహాయం రానందున మండల విద్యాశాఖ అధికారి పోతుగంటి నర్సయ్య ఆధ్వర్యంలో ఎమ్మార్సీ సిబ్బంది సహకారంతో మండలంలో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయు లు, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు ఒక లక్ష 4 వేల 600 (1,04,600/-) రూపాయలు ఆర్థిక సహాయం అందించి, కీ.శే.సాంబయ్య కూతురు పేరున పోస్ట్ ఆఫీస్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి కుటుంబ సభ్యులకు అందించడం అయినది. మండల విద్యాశాఖ అధికారి నర్సయ్య ఆర్థిక సాయం అందించిన ప్రతి ఒక్కరికి మండల విద్యాశాఖ పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు భూసారి అంజయ్య, పాలకుర్తి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఓరుగంటి రమేష్, వివిధ మండల ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు బైకానీ వెంకటయ్య,దాసు వెంకటేశ్వర్లు, ఇమ్మడి అశోక్, షరీఫ్,మధు,బలరాం నాయక్,వెంకట నర్సయ్య, వడ్లకొండ శ్రీనివాస్, విజయేందర్ ఎమ్మార్సీ సిబ్బంది తాడూరు రమేష్, ఈరెంటి సరేష్, అరుణ,మల్లేష్, మల్లికాంబ, కిషన్ వివిధ పాఠశాలల ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.