తేది:07-01-2026 భూపాలపల్లి జిల్లా TSLAW NEWS గణపురం మండలం రిపోర్టర్ దీపక్ పటేల్ పుప్పాల.
భూపాలపల్లి జిల్లా:గణపురం మండల కేంద్రంలోని హై స్కూల్ ఆవరణలో సీఎం కప్ క్రీడలను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించనున్నట్లు కాంగ్రెస్ మండల శాఖ అధ్యక్షులు , మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రేపాక రాజేందర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీఎం కప్ ఆటల పోటీల ర్యాలీని ప్రారంభించనున్నట్లు రాజేందర్ తెలిపారు పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు మహిళా నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, సీనియర్ నాయకులు అభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేాలని విజ్ఞప్తి చేశారు.