తేది:07-01-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS అమీన్‌పూర్ మండలం రిపోర్టర్ రాము రావు చాతరాజు.
సంగారెడ్డి జిల్లా: సంక్రాంతి పండుగను కుటుంబ సమేతంగా ఆనందంగా జరుపుకునేలా పటాన్‌చెరులో ప్రత్యేక వేడుకకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 6వ MDR డే/నైట్ కైట్ & లాంతర్ ఫెస్టివల్-2026ను జనవరి 14న పటాన్‌చెరులోని మైత్రి స్టేడియంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభమై పగలు నుంచి రాత్రి వరకు కొనసాగనుంది.
పగటి వేళ రంగురంగుల గాలిపటాలతో ఆకాశం పండుగ శోభను సంతరించుకోనుండగా, రాత్రి వేళ లాంతర్ల వెలుగులతో స్టేడియం అంతా ప్రత్యేక ఆకర్షణగా మారనుంది. పిల్లలు, యువత, పెద్దలు అందరూ కలిసి ఆనందంగా పాల్గొనేలా ఈ ఫెస్టివల్‌ను రూపకల్పన చేశారు. సంప్రదాయం, వినోదం, కుటుంబ అనుబంధం ఒకే వేదికపై కనిపించేలా ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ సంక్రాంతి వేడుకలను ప్రముఖ సామాజిక కార్యక్రమాల నిర్వాహకుడు మాద్రి పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. పండుగల ద్వారా కుటుంబ సభ్యులు కలిసి గడిపే సమయానికి ప్రాధాన్యం ఇవ్వడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
కార్యక్రమంలో పాల్గొనదలచిన వారు వీడియోలో ఉన్న QR కోడ్‌ను స్కాన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు. భద్రత దృష్ట్యా చైనీస్ మాంజాను పూర్తిగా నిషేధించినట్లు వెల్లడిస్తూ, అందరూ బాధ్యతాయుతంగా, సురక్షితంగా పండుగను జరుపుకోవాలని కోరారు. రంగుల ఆకాశం, వెలుగుల రాత్రి, కుటుంబంతో మధుర క్షణాలు-ఈ సంక్రాంతికి పటాన్‌చెరులో జరగనున్న ఈ వేడుక నగరవాసులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.