
తేది:7-01-2026 జగిత్యాల జిల్లా TSLAWNEWS ఇబ్రహీంపట్నం మండల రిపోర్టర్ రాడే శ్రీనివాస్.
జగిత్యాల జిల్లా : జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఇబ్రహీంపట్నం ఎస్సై అనిల్ నేతృత్వంలో నిర్వహించగా, సైబర్ క్రైమ్, ట్రాఫిక్ డ్రగ్స్.మరియు ఉమెన్ ట్రాప్ కింగ్.వంటి పలు అంశాలపై విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా ఎస్సై అనిల్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రమశిక్షణను అలవర్చుకోవాలని, సోషల్ మీడియా వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనవసర లింకులు ఓపెన్ చేయకుండా, తెలియని వ్యక్తులతో వ్యక్తిగత సమాచారం పంచుకోరాదని హెచ్చరించారు. డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలు, ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిన అవసరాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ ఆంజనేయులు తో పాటు పోలీస్ సిబ్బంది, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.