
తేది:07-01-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.
జగిత్యాల జిల్లా: బాలికల ఆరోగ్య సంరక్షణతోనే ఆరోగ్యవంతమైన మహిళగా భవిష్యత్తులో రాణించగలుగుతారని ఐఎంఏ జగిత్యాల శాఖ అధ్యక్షులు డా. గూడూరు హేమంత్ పేర్కొన్నారు.
బుధవారం రోజున స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చల్ గల్ లో ఐఎంఏ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో బాలికలకు వైద్య పరీక్షలు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో సగభాగమైనటువంటి మహిళలు బాల్య దశ నుండే ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటూ, ఆరోగ్యకరమైనటువంటి జీవనశైలిని అలవాటు చేసుకుంటే యుక్త వయసు వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్య లేకుండా తమ ఎంచుకున్న రంగాల్లో రాణించడానికి అవకాశం ఉంటుందన్నారు.
ఐఎంఏ ప్రధాన కార్యదర్శి డా. ఆకుతోట శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రతినెల ఒక ప్రభుత్వ పాఠశాలను ఎంచుకొని అందులో ఉన్నటువంటి బాలికలందరికీ రక్తహీనత పరీక్షలు నిర్వహించి అవసరమైనటువంటి మందులను ఐఎంఏ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు.
ఈ శిబిరంలో పిల్లల వైద్య నిపుణుడు డాక్టర్ ఆగంతం నరేష్ మరియు ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ హరిత పాల్గొని విద్యార్థినులకు పరీక్షలు నిర్వహించి అవసరమైనటువంటి మందులు మరియు శానిటరీ ప్యాడ్స్ విద్యార్థులకు అందించడం జరిగింది.
ఈ శిబిరంలో మొత్తం 74 మంది బాలికలకు రక్తహీనత పరీక్షలు నిర్వహించడం జరిగింది . అందులో 59 మందికి రక్తహీనత ఉన్నట్టుగా గుర్తించి మందులు పంపిణీ చేయడం జరిగింది.
ఈ శిబిరంలో ఉపాధ్యాయులు శ్రీనివాస్, మంజుల, చంద్రశేఖర్, విష్ణు, లచ్చయ్య ,మాధవి, యమునా, సుమలత ,వెంకటలక్ష్మి అంజాద్ తదితరులు పాల్గొన్నారు.