కళాశాలలో ప్రిన్సిపల్ పై అధ్యాపకుల ఫిర్యాదుపై-జిల్లా అధికారి మాధవి విచారణ.

తేది:7- 01- 2026 మెదక్ జిల్లా TSLAWNEWS అల్లాదుర్గం మండల రిపోర్టర్ వి పాపయ్య చారి.

మెదక్ జిల్లా: అల్లాదుర్గం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకుల మధ్య చిన్నపాటి గొడవలపై బుధవారం డి ఐ ఈ ఓ మాధవి ఇరువురిని కూర్చోబెట్టి విచారణ జరిపారు. జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ సత్తయ్య, తమను అకారణంగా వేధిస్తున్నారని అధ్యాపకులు శంకర్ ఫిర్యాదు చేయడంతో ఇరువురికి మద్దతుగా గ్రామస్తులు కళాశాలకు చేరుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసాయి. ఈ సందర్భంగా సీఐ రేణుక రెడ్డి, ఎస్ఐ శంకర్ లు కళాశాలకు చేరుకొని రాజకీయాలు వద్దని వారిని పంపించేశారు. దీనిపై డి ఐ ఈ ఓ మాధవి ఇరువురిని విచారణ చేసి ఇకనుండి కళాశాలలో ఏలాంటి సంఘటన జరిగిన చర్యలు తీసుకుంటామని వారిని హెచ్చరించడంతో ఇప్పటినుండి కలిసిమెలిసి ఉంటామని ప్రిన్సిపాల్ , సిబ్బంది తెలపడంతో విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా మంచి విద్యాబోధన అందించాలా అందరు కృషి చేయాలని సూచించారు. కళాశాలలో ఇకనుండి అందరం కలిసి పని చేస్తారని డి ఐ ఈఓ తెలిపారు.
ప్రిన్సిపాల్ పై ఆరోపణలు అవాస్తవం గ్రామస్తులు డిఐఈఓ కు వినతిపత్రం. కళాశాల ప్రిన్సిపాల్ గా సక్రమంగా విధులు నిర్వహిస్తూ, నిబద్ధత పనిచేస్తున్న కొందరు కావాలని ఆయనపై బురద జల్లుతున్నారని పలువురు గ్రామస్తులు డిఐఓకు వినతిపత్రం అందజేశారు. కళాశాల అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తూ, విద్యార్థులకు ఉచిత మధ్యాహ్న భోజనం, ఎన్సిసి ప్రోగ్రాం, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాడని, కొందరు అధ్యాపకులు కులం పేరుతో ప్రిన్సిపల్ పై ఫిర్యాదు చేస్తున్నారని ఇవన్నీ అవస్తవమని వారు డి ఐ ఈ ఓ మాధవికి వినతి పత్రం అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *