
తేది:07-01-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS అమీన్‌పూర్ మండలం రిపోర్టర్ రాము రావు చాతరాజు.
సంగారెడ్డి జిల్లా: మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వెల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో మెజార్టీ గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఘన విజయం సాధించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ విజయంపై మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ స్పందిస్తూ, ఇది కాంగ్రెస్ శ్రేణుల సమిష్టి కృషికి దక్కిన ఫలితమని తెలిపారు. గజ్వెల్నియోజకవర్గంలో కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలు విశ్వసించి తమ ఓటుతో స్పష్టమైన తీర్పు ఇచ్చారని అన్నారు.
బుధవారం సిద్ధిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గెలుపొందిన సర్పంచులు, జిల్లా సర్పంచ్ ఫోరం అధ్యక్షుడిగా ఎన్నికైన మన్నె కళ్యాణ్, గజ్వెల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి తో కలిసి చిట్కుల్‌లోని నీలం మధు ముదిరాజ్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా నీలం మధు ముదిరాజ్ గారు విజయం సాధించిన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులను ఘనంగా సత్కరించి అభినందించారు. కాంగ్రెస్ అభ్యర్థుల విజయంలో నర్సారెడ్డి గారి నాయకత్వం, పార్టీ కార్యకర్తల అంకితభావం కీలక పాత్ర పోషించిందని కొనియాడారు.
ప్రజలు నమ్మి అప్పగించిన బాధ్యతను గౌరవిస్తూ గ్రామాల్లోని సమస్యలను పరిష్కరిస్తూ, అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని ఆయన సూచించారు.