జర్నలిస్ట్ ల సంక్షేమమే నా ధ్యేయం-ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్.

తేది:7-1-2026 TSLAWNEWS మెదక్ జిల్లా మెదక్ మండలం రిపోర్టర్ శివలింగం ఎల్లం.

మెదక్ జిల్లా: జర్నలిస్ట్ ల సంక్షేమమే నా ధ్యేయంగా పనిచేస్తున్నానని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు.మెదక్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముప్పై నాలుగు మంది జర్నలిస్ట్ లకు డాక్టర్ మైనంపల్లి రోహిత్ ఎమ్మెల్యే ఇళ్ల పట్టాలను అందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జర్నలిస్ట్ బాధలు నాకు తెలుసునని, మీకు ఎలాంటి ఇబ్బందులు వచ్చిన నేనున్నానని భరోసానిచ్చాడు. అనంతరం ఎమ్మెల్యే ను జర్నలిస్ట్ లు
ఘనంగా సన్మానించారు.
ముందుగా ఎమ్మెల్యే కలెక్టరేట్ వద్ద ఓ కార్యక్రమంలో పాల్గొన్న విషయం తెలుసుకున్న జర్నలిస్ట్ లు కలెక్టరేట్ వద్ద కు వెళ్లి భారీ బైక్ ర్యాలీ తో క్యాంప్ కార్యాలయానికి తీసుకు వచ్చారు. ఆ ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లక్ష్మణ్ బాబు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నరేష్ గౌడ్,ఎలెక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు బొందుగుల నాగరాజు,సీనియర్ జర్నలిస్ట్ లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *