
తేది:7-01- 2026 మెదక్ జిల్లాTSLAWNEWS అల్లాదుర్గం మండల రిపోర్టర్ వి పాపయ్య చారి.
మెదక్ జిల్లా: అల్లాదుర్గం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా విద్యార్థులకు మెదక్ డిఎస్పీ శ్రీ ప్రసన్న కుమార రోడ్డు భద్రత అవగాహన సదస్సు నిర్వహించారు. కళాశాల లోని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ అపరిచిత వ్యక్తులతో వాట్సాప్ కాల్ లో లింకులు ఓపెన్ చేసి మోసపోవద్దని విద్యార్థులకు తెలియజేశారు. రోడ్డు యాక్సిడెంట్ ల గురించి ద్విచక్ర వాహనము నడిపేవారు తప్పకుండా హెల్మెట్ ధరించాలని సీట్ బెల్ట్ లేనిదే కారు నడపకూడదని మద్యం సేవించి వాహనములు నడపకూడదని డ్రైవింగ్ లైసెన్స్ వాహనం లకు ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని కళాశాల విద్యార్థులకు తెలియజేశారు. విద్యార్థులతో రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించారు
ఈ కార్యక్రమంలో సీఐ రేణుక రెడ్డి, ఎస్సై శంకర్, ఏఎస్ఐ గాలయ్య, కళాశాల ప్రిన్సిపల్ సత్తయ్య కళాశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.