తేది:07-01-2026 భూపాలపల్లిజిల్లా TSLAWNEWS గణపురం మండలం రిపోర్టర్ దీపక్ పటేల్ పుప్పాల.
భూపాలపల్లి జిల్లా: గణపురం మండలం పెండింగ్ డి ఏ లు విడుదల చేయకపోతే ఉద్యమ బాట తప్పదని పి ఆర్ టి యు మండల అధ్యక్షులు బిల్ల రఘునాథరెడ్డి అన్నారు.బుదవారం మండలంలోని వివిధ పాఠశాలల్లో 2026 క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఈకార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అద్యక్షులు కుమారస్వామి రాష్ట్ర బాధ్యులు ,సతీష్ చంద్రమౌళి ,పాశం బాబు ,మండల ప్రధాన కార్యదర్శి యుగంధర్ లు ముఖ్యఅతిథులు గా పాల్గొనగా ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బిల్ల రఘునాథరెడ్డి మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న ఆరు డిఎ ల నుండి తక్షణం మూడు విడుదల చేయకపోతే పి ఆర్ టి యు ఉద్యమ కార్యచరణకు ముందుకు వస్తుందని అన్నారు.గత ప్రభుత్వం ఉద్యోగుల పట్ల చిన్నచూపు చూడడం వల్ల ఎన్నికల్లో ఫలితం అనుభవించారని మరి ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే ధోరణి అవలంబించినట్లయితే గత ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందని. కనుక న్యాయపరంగా రావాల్సినటువంటి డిఎ లు విడుదల చేసి త్వరలో పిఆర్ సి అమలుపరచాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు జలంధర్ రాజేందర్,భరత్,రజిత ,సీతామాలక్ష్మితిరుపతి, స్రవంతి, జ్యోతి, విజయలక్ష్మి, శ్రీనివాస్ రెడ్డి, చందు తదితరులు పాల్గొన్నారు.