తేది:07-01-2026 భూపాలపల్లి జిల్లా TSLAWNEWS గణపురం మండలం రిపోర్టర్ దీపక్ పటేల్ పుప్పాల.
భూపాలపల్లి జిల్లా: గణపురం ప్రజాజ్యోతి జనవరి 07 కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ డివిజనల్ ఇంజనీర్ నందిపాటి భాస్కర్ సీనియర్ కెమిస్ట్ మోతే తిరుపతి ల ఆధ్వర్యంలో చీఫ్ ఇంజనీర్ చిట్టాప్రగఢ శ్రీ ప్రకాష్, అన్ని విభాగాల సూపరింటెండెంట్ ఇంజనీర్లను విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ తాడూరి రఘుపతి లను వారి కార్యాలయంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.ఈ సందర్భంగా సంబంధిత సమస్యల పరిష్కారానికి చీఫ్ ఇంజనీర్ సానుకూలంగా స్పందించి సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయడం జరిగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కెటిపిపి మాదిగ ఉద్యోగులు చీఫ్ కెమిస్ట్ కె. నాగయ్య, పి. శేఖర్ ఎ.ఇ. ప్రవీణ్ ఎ.ఇ. గొపి ఎ.ఇ. కొడెపాక రత్నాకర్, చిలువేరు మల్లయ్య, బొమ్మకంటి రాజేందర్, అల్లూరి శ్రీనివాస్, బిరెల్లి రాజు, బొచ్చు శంకర్, రమేష్, విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్లు కార్మికులు సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.