తేది:7-01-2026 మెదక్ జిల్లా TSLAWNEWS పాపన్నపేట మండలం రిపోర్టర్ జే.దేవచిత్తం.
విద్యార్థిని విద్యార్థుల స్పోర్ట్స్ డ్రెస్ లను ఆవిష్కరించిన- పాఠశాల ప్రధానోపాధ్యాయులు, చైర్మన్, గ్రామ సర్పంచ్, పాలకవర్గ సభ్యులు.
మెదక్ జిల్లా: పాపన్నపేట మండలం ప్రాథమిక పాఠశాల నాగసాన్ పల్లిలో బుధవారం రోజున పాఠశాల తల్లిదండ్రులు సమకూర్చిన స్పోర్ట్స్ డ్రెస్ ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు, చైర్మన్ , గ్రామ సర్పంచ్ ,పాలకవర్గ సభ్యులు తల్లిదండ్రుల సమక్షంలో ఆవిష్కరించారు. అనంతరం వీటిని విద్యార్థిని విద్యార్థులకు అందజేశారు. అనంతరం గ్రామపంచాయతీ నూతన పాలకవర్గ సభ్యులకు పాఠశాల తరఫున సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కిషన్, ఏఏపీసీ చైర్మన్ చంద్రమ్మ, గ్రామ సర్పంచ్ సుశీల, ఉప సర్పంచ్ సిరాజ్, వార్డు సభ్యులు, విశ్రాంత ఉపాధ్యాయులు మైపాల్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం, తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.