జాతీయ రోడ్డు భద్రత మాసం 2026 ప్రచారం కోసం రోడ్డు భద్రతా ప్రతిజ్ఞ- ఆర్టీవో సత్యనారాయణ.

తేది:07-01-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS సదాశిపేట మండలం క్రైమ్ రిపోర్టర్ బి ప్రసాద్ గౌడ్.

జాతీయ రోడ్డు భద్రత మాసం 2026 ప్రచారం కోసం రోడ్డు భద్రతా ప్రతిజ్ఞ- ఆర్టీవో సత్యనారాయణ.

ఆక్స్ఫర్డ్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు రోడ్ భద్రత నియమ నిబంధనల పట్ల అవగాహన కల్పిస్తున్న- ఆక్స్ఫర్డ్ స్కూల్ ప్రిన్సిపాల్ సంగమేశ్వర్.

సంగారెడ్డి జిల్లా, సదాశివపేట మండలం: తెలంగాణ రవాణా శాఖ జాతీయ రోడ్డు భద్రతామాసం 2026 ప్రచారం కోసం నిర్వహించిన కార్యక్రమాన్ని పునస్కరించుకొని సదాశిపేట మండలంలో గల ఆక్స్ఫర్డ్ స్కూల్ విద్యార్థినీ విద్యార్థులకు ప్రమాదాలను తగ్గించడానికి ట్రాఫిక్ నియమాలపై అవగాహన మరియు కట్టుబడి ఉండటాన్ని ప్రోత్సహించడం ఈ నెల రోజులపాటు జరిగే కార్యక్రమం యొక్క లక్ష్యం అని సంగారెడ్డి జిల్లా ఆర్టిఏ అధికారి సత్యనారాయణ పేర్కొన్నారు. అదేవిధంగా విద్యార్థినీ విద్యార్థులచే డ్రైవింగ్ చేసే ముందు భద్రతకు సంబంధించిన అన్ని విషయాలపై శ్రద్ధ వహిస్తామని, రోడ్డు మరియు ట్రాఫిక్ నియమాలను ఎల్లప్పుడూ పాటిస్తామని, ఇట్టి విషయం స్వంత భద్రత మరియు తోటి ప్రయాణికుల భద్రతకు నిర్ధారిస్తామని ప్రతిజ్ఞలో భాగంగా వాగ్దానం చేయించారు. ఈ యొక్క కార్యక్రమంలో ఆక్స్ఫర్డ్ స్కూల్ సిబ్బంది మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *