తేది:6-1-2026 ఖమ్మం జిల్లాTSLAWNEWS వేంసూరు మండలం రిపోర్టర్. మహమ్మద్ బురహానుద్దీన్.
ఖమ్మం జిల్లా: ఖమ్మం జిల్లాలోని మండల కేంద్రమైన వేంసూరు లోని బాపనుకుంట( బూరుగువాగు కుంట) లోని చెరువు నీటిని అక్రమంగా మోటారు ఇంజన్ల ద్వారా, కొందరు వ్యక్తులు అక్రమంగా వారి స్వార్థం కోసం వారి పంట పొలాలకు నీటిని తోడేస్తున్నారని వెంసూరు మత్స్య కార్మిక సొసైటీ సభ్యులు, ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని తాసిల్దార్ మానిక్ రావుకు ఫిర్యాదు చేశారు.వేం సూర్ మత్స్య కార్మిక సొసైటీ లో ఎరుకల మరియు, గౌడ, మరియు మంగలి, కులాల తో ఏర్పడిన మత్స్య కార్మిక సొసైటీ ఎప్పటినుంచో ఏర్పాటు చేసుకున్నామని. మాజీ కార్మిక సొసైటీ వైస్ ప్రెసిడెంట్ ఇట్టా వెంకటేశ్వరరావు తెలిపారు.
మండల పరిధిలోని ఏడు చెరువులకు గాను 27 వేల చాప పిల్లలు వైరా వారు సరఫరా చేసి ఉన్నారు. మండల కార్యాలయం వద్ద ఈ చేప పిల్లలను మత్స్య కార్మిక సొసైటీ వారికి పెంచుకోమని ఇచ్చారని ఇట్టా వెంకటేశ్వరరావు తెలిపారు. 27 వేల చే ప పిల్లల్లో, కేవలం 13,500 విలువ కలిగిన చేప పిల్లలు ఉన్నాయని, చెరువు తూము పారుదల ఆగిపోయినప్పటికీ అతి చెరువు కింద రైతు ఇంజన్లు పెట్టి చెరువులోని చేప పిల్లలు బతకనివ్వకుండా చేస్తున్నారని, దీనివలన చెరువులోని చేప పిల్లలు చనిపోతున్నాయని కమిటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. వారి స్వార్థం కోసం వ్యవసాయ భూములకు వారి పంట పొలాలకు చెరువులోని నీటిని అక్రమంగా వినియోగించుకోవడం అన్యాయమని, వారు ఆవేదన వ్యక్తం చేశారు. చెరువులో నీరు లేకుండా ఎండిపోతున్నదని, ఈ విషయాన్ని పరిశీలించి చెరువులో నీటిని పె ట్టుకొనివ్వకుండా చర్యలు తీసుకోవాలని చేప పిల్లలు బతికే విధంగా చూడాలని కమిటీ సభ్యులు కంప.గణేష్, జగన్నాథం, మరికొందరు సభ్యులు కోరుతున్నారు.