అల్లాదుర్గం మండల ప్రజా పరిషత్ కార్యాలయం నుండి తాసిల్దార్ కార్యాలయం వరకు పదిహేను లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో సిసి రోడ్లు పనులు ప్రారంభం.

తేది: 6- 01- 2026 మెదక్ జిల్లా TSLAWNEWS అల్లాదుర్గం మండల రిపోర్టర్ బి పాపయ్య చారి.

మెదక్ జిల్లా : అల్లాదుర్గం మండల ప్రజా పరిషత్ కార్యాలయం నుండి తాసిల్దార్ కార్యాలయం వరకు పదిహేను లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో సిసి రోడ్లు పనులు మంగళవారం ప్రారంభించారు. సిఐ రేణుక రెడ్డి, తాసిల్దార్ మల్లయ్య, ఎంపీడీవో వేద ప్రకాశ్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శేషారెడ్డి , పి ఆర్ ఏ ఈ రమేష్ తో పాటు ఆయా గ్రామాల సర్పంచ్లు కొబ్బరికాయలు కొట్టి సీసీ రోడ్డు పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు సుభాష్ రావు, ప్రధాన కార్యదర్శి బాల కిషన్, ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు బలరాం, సర్పంచులు నరసింహారెడ్డి,శ్రీనివాస్ రెడ్డి, శశిధర్ రెడ్డి, వీరన్న, మద్దూరి సౌమ్య సురేష్ గౌడ్, ఉప సర్పంచ్ లు పాండు, శ్రీకాంత్, నాయకులు చెన్నప్ప, ప్రభు, చంద్రశేఖర్, బేతయ్య శ్రీశైలం, సదానందం, విట్టల్ రెడ్డి, ఆంజనేయులు, మహేష్, శ్రీకాంత్, జైపాల్, యాదగిరి చందర్, నరసింహులు తదితరులున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *