బస్సులు సర్వీస్ రోడ్డు వెంబడి రావాలని గ్రామస్తులు ధర్నా.

తేది:6- 01- 2026 మెదక్ జిల్లా TSLAWNEWS అల్లాదుర్గం మండల రిపోర్టర్ వి పాపయ్య చారి.

మెదక్ జిల్లా: అల్లాదుర్గం మండలం రాంపూర్ బస్సు స్టేజి వద్ద రాంపూర్ సీతా నగర్ గ్రామ ప్రజలు మంగళవారం రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. వారు మాట్లాడుతూ ఆర్టీసీ బస్సులు సర్వీస్ రోడ్డు వెంబడి రాకుండా హైవేపై నుండి వెళ్లిపోవడంతో ప్రయాణికులకు చాలా ఇబ్బందిగా ఉందని గంటపాటు రోడ్డుపై ధర్నా చేశారు. రోడ్డుపై వాహనాలు ఆగిపోవడంతో సమాచారం అందుకున్న అల్లాదుర్గం ఎస్ఐ శంకర్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని బయట ఇచ్చిన ప్రజలతో , ఆర్టీసీ అధికారులతో మాట్లాడి ఇప్పటినుండి సర్వీస్ రోడ్డు వెంబడి ఆర్టీసీ బస్సులు వచ్చేటట్లు చూస్తామని ఆర్టీసీ అధికారులు చెప్పడంతో ఆందోళన చేస్తున్న ప్రజలకు ఎస్సై సర్ది చెప్పారు. ఇప్పటినుండి సర్వీసు రోడ్డు వెంబడి ఆర్టీ బస్సులు రాకుంటే పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తామని రెండు గ్రామాల ప్రజలు ఆర్టీసీ అధికారులకు హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *