విద్యుత్తు సమస్యల తక్షణ పరిష్కారానికే ప్రజా బాట, విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ మల్చూర్ నాయక్, గణపురంలో ఘనంగా ప్రారంభమైన ప్రజాబాట.

తేది:06-01-2026 భూపాలపల్లి జిల్లా TSLAWNEWS గణపురం మండలం రిపోర్టర్ దీపక్ పటేల్ పుప్పాల.

భూపాలపల్లి జిల్లా: గణపురం మండలం విద్యుత్ సమస్యల తక్షణ పరిష్కారం కొసమే ప్రజాబాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎన్పీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ మల్చూర్ నాయక్ అన్నారు మంగళవారం గణపురం మండల కేంద్రంలోని కొత్తపల్లి సమీపంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఆవరణలో ప్రజాబాట కార్యక్రమాన్ని గణపురం సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్ లతో కలిసి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వారంలో మూడు రోజులపాటు విద్యుత్తు సమస్యల పరిష్కారం కొసం తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రజా బాట కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు .విద్యుత్ వినియోగదారులు రైతులు ఈ మూడు రోజుల్లో సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళితే సత్వరమే పరిష్కారం జరుగుతుందని ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగిందని ముందుగా గణపురం గ్రామంలో ప్రారంభించడం జరిగిందని తెలిపారు అదేవిధంగా గణపురం గ్రామంలో వ్యవసాయ వినియోగానికి సంబంధించి 3225 గృహవినియోగానికి సంబంధించి 7 7 6 8 గృహజ్యోతికి సంబంధించి 4469 సర్వీసులు ఉన్నట్లు వివరించారు. గృహ జ్యోతిలో 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగానికి సంబంధించి గృహ జ్యోతిలో లేనటువంటి వారు స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో నమోదు చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో గణపురం ఎఈ వెంకటరమణ ఎఎఓ శ్రీనివాస్ ఎల్ ఐ రాధాకృష్ణ తోపాటు గ్రామ ఉప సర్పంచ్ ఓరుగంటి కృష్ణ గౌడ్ భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రేపాక రాజేందర్ కాంగ్రెస్ పార్టీ మండల అధికార ప్రతినిధి మామిండ్ల మల్లికార్జున గౌడ్ మాజీ ఎంపీపీ వడ్లకొండ నారాయణ గౌడ్ మాజీ కోఆప్షన్ సభ్యులు ఎండి చోటేమియా కోరె రమేష్ రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *