తేది :06-01-2026 భూపాలపల్లి జిల్లా TSLAWNEWS గణపురంమండలం రిపోర్టర్ దీపక్ పటేల్ పుప్పాల.
భూపాలపల్లి జిల్లా: గణపురం మండలంలోని బస్వరాజుపల్లి శ్రీ నేతాజీ పాఠశాలలో మంగళవారం పాఠశాల కరస్పాండెంట్ ఉడుత సాంబయ్య యాదవ్ ఆధ్వర్యంలో 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సాంబయ్య యాదవ్ మాట్లాడుతూ 2025 సంవత్సరంలో ఉత్తమ ఫలితాలు సాధించామని 2026 లో కూడా తమ పాఠశాల విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులకు క్యాలెండర్లను అందజేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సారయ్య ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.