గొర్రెల మందపై కుక్కల దాడి ఎనిమిది గొర్రెలు మృతి లక్ష్మారెడ్డి పల్లిలో ఘటన.

తేది :06-01-2026 భూపాలపల్లి జిల్లా TSLAWNEWS గణపురం మండలం రిపోర్టర్ దీపక్ పటేల్ పుప్పాల.

భూపాలపల్లి జిల్లా: గణపురం మండలంలోని లక్ష్మారెడ్డి పల్లి గ్రామంలో వీధి కుక్కలు స్వైరవిహారం చేశాయి. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత గ్రామానికి చెందిన మొగిలి రాజయ్య అనే రైతు నివాసంలోని గొర్రెల పాకపై కుక్కల మంద దాడి చేసింది. పాక చుట్టూ ఉన్న ఫెన్సింగ్ పీకేసి లోపలికి ప్రవేశించిన కుక్కలు గొర్రెలను కొరికి చంపాయి. ఈ దాడిలో సుమారు ఎనిమిది గొర్రెలు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి. సుమారు రూ. 50 వేల ఆస్తి నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం తనను న ఆదుకోవాలని బాధితుడు రాజయ్య కన్నీరుమున్నీరవుతున్నాడు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ వీరమల్ల సంపత్ రెడ్డి బాధితుడిని పరామర్శించారు. జరిగిన నష్టాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలో కుక్కల బెడద పెరిగిపోతోందని, అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *