సైబర్ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న వీరవెల్లి శ్రీలత.

తేది:06- 01- 2026 TSLAWNEWS మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ పారువెల్లి దుర్గ భవాని.

హైదరాబాద్,మేడ్చల్:నేటి ఆధునిక డిజిటల్ యుగంలో సెల్‌ఫోన్ వినియోగం విపరీతంగా పెరిగింది. ప్రతి లావాదేవీ కూడా ఆన్‌లైన్, డిజిటల్ పద్ధతిలో జరుగుతున్న నేపథ్యంలో సామాన్య ప్రజలు తెలియకుండానే సైబర్ నేరాల బారిన పడుతూ తమ విలువైన వ్యక్తిగత సమాచారం మరియు డబ్బును కోల్పోతున్నారు.ఈ నేపథ్యంలో ప్రజలకు సైబర్ భద్రతపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో స్కిల్ వేద సంస్థ ఆధ్వర్యంలో “సైబర్ సురక్ష – 2026” అనే సైబర్ అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సైబర్ నేరాలు జరిగితే ఎలా గుర్తించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మోసాల నుంచి ఎలా రక్షించుకోవాలి అనే అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ప్రముఖ స్పీకర్ & ట్రైనర్ ప్రమీల్ అర్జున్ సైబర్ నేరాల బారిన పడినప్పుడు తీసుకోవాల్సిన చర్యలు, చట్టపరమైన పరిష్కారాలు, డిజిటల్ భద్రతా మార్గాలను సవివరంగా వివరించారు.ఈ అవగాహన కార్యక్రమంలో
వీరవెల్లి శ్రీలత క్రియాశీలకంగా పాల్గొని సర్టిఫికేట్ పొందారు.
ఆమె పరిచయం:
ఇంపాక్ట్ మోటివేషనల్ ట్రైనర్
నారీసెల్ రీజనల్ డైరెక్టర్
బాల సురక్ష వాలంటీర్
యాంటీ నార్కోటిక్ సోల్జర్
సైబర్ వారియర్
సమాజంలో డిజిటల్ భద్రత, బాలల రక్షణ, మత్తు పదార్థాల నివారణ మరియు సైబర్ నేరాలపై అవగాహన కల్పించడంలో శ్రీలత చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఇటువంటి అవగాహన కార్యక్రమాలు ప్రజలను సైబర్ నేరాల నుంచి రక్షించడంలో కీలకంగా మారుతున్నాయని నిర్వాహకులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *