పూత తో విరబూసిన మామిడి చెట్లు ఆనందంలో మామిడి రైతులు.

తేది:06-01-2026 వికారాబాద్ జిల్లా TSLAWNEWS వికారాబాద్ మండలం రిపోర్టర్ లక్ష్మీనారాయణ గొల్ల.

వికారాబాద్ జిల్లా: వికారాబాద్ జిల్లా పరిసర ప్రాంతాలలోని వికారాబాద్ మండలం మోమిన్ పేట, నవాబుపేట పూడూర్ మండల పరిధిలోని పలు గ్రామాలలో ఈ సంవత్సరం వాతావరణ పరిస్థితులు అనుకూలించడం అధికంగా వర్షాలు కురవడంతో మామిడి చెట్లు అధికంగా పూతతో ఉండడం వల్ల రైతులు అధిక దిగుబడి వస్తుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు . ఈ ప్రాంతంలో పండిన మామిడి పళ్ళకి ముంబై ,హైదరాబాద్, బెంగుళూర్ లాంటి నగరాలలో చాలా గిరాకీ ఉంటుంది .ఈసారి తమకు పంట అధికంగా వచ్చే అవకాశాలు ఉన్నాయని వారు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *