తెలంగాణ ఆత్మగౌరవానికి మళ్లీ మంటలు రాజేయండి – జనవరి 10న సూర్యాపేటకు కదలండి!

తేది: 05-01-2026 జనగామ జిల్లా TSLAWNEWS పాలకుర్తి మండలం రిపోర్టర్ Maroju Bhaasker.

అంబేద్కర్ ఆశయాల సాక్షిగా ‘చలో సూర్యాపేట- టీయూజేఏసీ బహిరంగ సభ పోస్టర్ ఆవిష్కరణ.

జనగామ: జనగామ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఈరోజు తెలంగాణ ఉద్యమకారులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను స్మరిస్తూ తెలంగాణ ఉద్యమ స్పూర్తిని మరింత బలపరచాల్సిన అవసరం ఉందని ఉద్యమకారులు పేర్కొన్నారు.
అనంతరం తెలంగాణ ఉద్యమకారుల టీయూజేఏసీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో, జనవరి 10న సూర్యాపేటలో నిర్వహించనున్న తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ బహిరంగ సభకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను అధికారికంగా ఆవిష్కరించారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఉద్యమకారుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ నేత కన్నారపు పరుషురాములు మాట్లాడుతూ, “అంబేద్కర్ చూపిన సమానత్వం, న్యాయం, హక్కుల మార్గమే తెలంగాణ ఉద్యమానికి దిశానిర్దేశం చేసింది. ఆ ఉద్యమ స్పూర్తిని కాపాడుకునేందుకు జనవరి 10న జరిగే సూర్యాపేట బహిరంగ సభ కీలక మలుపు” అని అన్నారు.
తెలంగాణ సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలను గుర్తుచేసుకుంటూ, ఉద్యమ ఫలాలు ప్రజలకు చేరాలంటే ఉద్యమకారుల ఐక్యత అత్యవసరమని ఆయన పిలుపునిచ్చారు. జనగామ జిల్లాలోని తెలంగాణ ఉద్యమకారులు, యువత, ప్రజాసంఘాలు అందరూ పెద్ద సంఖ్యలో సూర్యాపేటకు తరలివచ్చి బహిరంగ సభను ఘనంగా విజయవంతం చేయాలని టీయూజేఏసీ నాయకులు విజ్ఞప్తి చేశారు.
అంబేద్కర్ ఆశయాలతో తెలంగాణ ఉద్యమ స్వరాన్ని మళ్లీ గర్జింపజేద్దాం,జనవరి 10న చలో సూర్యాపేట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *