

తేది:5-1-2026 ఖమ్మం జిల్లాTSLAWNEWS వేంసూర్ మండలం రిపోర్టర్. మహమ్మద్. బురహానుద్దీన్.
స్కూలు బస్సుప్రమాదం దర్యాప్తు జరపాలి, వివేకానంద పాఠశాల యజమాని దేశిరెడ్డి నాగేందర్ రెడ్డి పై, డ్రైవర్ ఆళ్ళ నవీన్ పై చర్యలు తీసుకోవాలి- విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన.
ఖమ్మం జిల్లా: వేంసూరు మండలం మద్దులగూడెం వివేకానంద విద్యాలయం ప్రైవేటు పాఠశాల బస్సు శుక్రవారం సాయంత్రం అదుపుతప్ప.. గణేష్ పాడు వద్ద కాలువలో పడిన విషయం విదితమే. ఈ ప్రమాదంలో సుమారు 40 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ఆదివారం తల్లిదండ్రుల సమాచారం మేరకు నలుగురు విద్యార్థులు విషమ పరిస్థితుల్లో ఉండగా వారిని విజయవాడ ఆస్పత్రికి తరలించారు. నలుగురు విద్యార్థుల పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో
విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో విజయవాడ లో మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ప్రమాదానికి గురైన బస్సు లో ఎంతమంది విద్యార్థులను బస్సులో ఎక్కించవచ్చు, లిమిట్ ఎంతవరకు ఉంది. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ నవీన్, అదేవిధంగా వివేకానంద పాఠశాల యజమాని దేశి రెడ్డి నాగేందర్ రెడ్డి, ని పెనుబల్లి పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తులు తమ రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకొని కేసులు నీరు గారిచే ప్రయత్నం చేస్తున్నట్లు మండలంలో ప్రచారం జరుగుతుంది. బస్సు ఫిట్నెస్ కెపాసిటీ మించి 107 మందిని విద్యార్థులను నెక్కించుకోవడం విచారకర్మని పలు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జిల్లాకు చెందిన ఒక మంత్రి చొరవతో ఈ కేసు నుండి బయటపడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉండగా పిల్లల పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఈ విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచినట్లు సమాచారం. పార్టీ ద్వారా విచారణ చేపట్టాలని, పాఠశాల యాజమాన్యం పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.