ఎగ్జిట్ పోల్స్ మాకు వ్యతిరేకంగా ఉండటం ఇదే తొలిసారి కాదని మంత్రి కేటీఆర్ అన్నారు. 2018లో ఎగ్జిట్ పోల్స్ ఒక్క సంస్థ మాత్రమే సరిగా చెప్పిందని.. 2018లోనూ టీఆర్ఎస్ ఓడిపోతుందని ఎగ్జిట్‌పోల్స్ చెప్పాయని కానీ అలా జరుగలేదన్నారు.70కి పైగా స్థానాలతో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. డిసెంబరు 3న ఫలితాలు వచ్చాకా ఈ సర్వే సంస్థలన్నీ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెబుతాయా? అని ప్రశ్నించారు.