ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను మంత్రి సురేఖ గారికి అందజేసిన ఎమ్మెల్యే నాగరాజు.

తేది:05-01-2026 హన్మకొండ జిల్లా TSLAWNWES  హన్మకొండ నియోజకవర్గం ఇంచార్జ్ దోమటి పవన్.

హన్మకొండ జిల్లా: ఈరోజు హైదరాబాద్‌ లోని దేవాదాయ–ధర్మాదాయ, అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండ సురేఖ గారిని వారి నివాసంలో వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు గారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు (జాతర) సందర్భంగా నిర్వహించనున్న కార్యక్రమాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను ఆలయ చైర్మన్, ఈవో, ప్రధాన అర్చకులతో కలిసి మంత్రివర్యులకు అందజేశారు.
అనంతరం మంత్రి కొండ సురేఖ గారు ఎమ్మెల్యే నాగరాజు కి స్వామివారి శేష వస్త్రాలను అందజేసి ఆశీర్వచనం చేసి, స్వామివారి తీర్థప్రసాదాలనుఅందజేశారు.తదనంతరం బ్రహ్మోత్సవాల నిర్వహణకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను మంత్రి సురేఖ గారు ఎమ్మెల్యే నాగరాజు గారిని అడిగి తెలుసుకున్నారు. బ్రహ్మోత్సవాలను భక్తుల సందడి, ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్ గౌడ్, ఆలయ ఈవో సుధాకర్ ,ఆలయ ప్రధాన అర్చకులు తో పాటు నందనం గ్రామ సర్పంచ్ జెట్టబోయిన రాజు, జిల్లా కాంగ్రెస్ నాయకులు పిన్నింటి అనిల్ రావు, మహమ్మద్ చోటే తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *