కొల్లాపూర్ స్వతంత్ర అభ్యర్థి శిరీష (బర్రెలక్క) కు 15 వేల ఓట్లు రావచ్చని ఆరా మస్తాన్ సర్వే పేర్కొంది. అయితే కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న జూపల్లి కృష్ణారావు గెలిచే అవకాశం ఉందని తెలిపింది. బర్రెలక్క గెలవకపోయినా.. గట్టి పోటీ ఇస్తుందని సర్వే వెల్లడించింది.