తేది:05-01-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS అమీన్పూర్ మండలం రిపోర్టర్ రాము రావు చాతరాజు.
సంగారెడ్డి జిల్లా:స్వామివారి కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రత్యేక పూజలు ముత్తంగి డివిజన్ పరిధిలోని పోచారం గ్రామంలో సోమవారం శ్రీ శ్రీ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం మరియు మల్లన్న జాతర కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్)తో పాటు MDR ఫౌండేషన్ కో–ఫౌండర్, బీఆర్ఎస్ నాయకులు మాద్రి పృథ్వీరాజ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన నాయకులు, ప్రాంత ప్రజలందరికీ ఆరోగ్యం, శాంతి, సుఖసంతోషాలు కలగాలని ప్రార్థించారు. అనంతరం జాతరలో పాల్గొన్న భక్తులతో ఆత్మీయంగా మమేకమై, గ్రామీణ సంప్రదాయాలు, సంస్కృతి కాపాడుకోవాల్సిన అవసరాన్ని వారు ప్రస్తావించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు మాద్రి పృథ్వీరాజ్ గారిని శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు. జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో పోచారం గ్రామం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది.