భారత నౌకాదళంలోకి యాంటీ సబ్‌మెరైన్ వార్ఫేర్‌లో ఉపయోగించే అత్యాధునిక యుద్ధ నౌకలను చేర్చుకుంది. ఈ మేరకు కొచ్చి షిప్‌యార్డ్‌లో తయారయ్యే 8 నౌకల్లో 3 షిప్‌లు సిద్దమయ్యాయి. దీంతో ఆ మూడు నౌకలైన ఐఎన్‌ఎస్ మహె, ఐఎన్‌ఎస్ మల్వాన్, ఐఎన్‌ఎస్ మాంగ్రోల్‌లను నేడు ప్రారంభించారు. వైస్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ సంజయ్ జె సింగ్, స్ట్రాటజిక్ ఫోర్స్ కమాండ్ అధిపతి సురాజ్ బెర్రీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.