తాళం వేసిన ఇంట్లో దొంగతనం,4తులాల బంగారం చోరీ-పనిచేయని సిసి కెమెరాలు.

తేది:5-01-2026 మెదక్ జిల్లా TSLAW NEWS అల్లాదుర్గం మండల రిపోర్టర్ వి పాపయ్య చారి.

మెదక్ జిల్లా : ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని దుండగులు లూటీకి పాల్పడ్డారు. ఈ ఘటన అల్లాదుర్గం మండలం ముప్పారం గ్రామానికి చెందిన బైండ్ల సునీత ఇంట్లో జరిగింది. తాను కుటుంబ సభ్యులతో కలిసి ఆర్సిపురంలో కూలి పనులు చేసుంటు జీవనం కొనసాగిస్తున్నారు.దసరా పండుగకు ఇంటికి వచ్చి ఆమె బీరువాలో 4 తులాల బంగారం ,కొంత వెండి ను దాచి తాళం వేసి హైదరాబాద్ కు వెళ్లిపోయారు.ఈ ఇంట్లో వారి అత్త మాములు ఉంటారు. ఆదివారం ఆమె ఇంటికి వచ్చి తలుపులు తెరిచి చూడగా బీరువా పగులగొట్టి అందులో దాచిపెట్టిన నాలుగు తులాల బంగారం కొంత వెండి గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. ఆ సమయంలో అత్తమామలు దన్నారం వెళ్లినట్లు ఆమె తెలిపారు .దింతో పోలీసులకు సమాచారం అందించగా ఘటన స్థలానికి చేరుకొని క్లూస్ టైమ్ సహాయం తో దొంగతనం కు సంబంచిన వివరాలను సేకరించారు.ఈ విషయమై బైండ్ల సునీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు అల్లాదుర్గం ఎస్సై శంకర్తె లిపారు.గ్రామంలో సిసి కెమెరాల నిఘా ఏర్పాటు ఉన్నప్పటికీ వాటి వినియోగం లేకపోవడంతో నేరస్థులను గుర్తించేందుకు వీలు లేకపోయింది .ఇప్పటికైనా అధికారులు స్పందించి నేరాల నియంత్రణ లో కీలకపాత్ర పోషించే సిసి కెమెరాల నిఘా ను వినియోగంలోకి తీసుకురావాలని గ్రామస్థులు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *