సైబర్ సురక్ష – 2026 అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న డా. పారువెల్లి అంక విజయ దుర్గ భవాని.

తేది:5- 01- 2026 TSLAWNEWS హైదరాబాద్ ఇంచార్జ్ బి.విజయ మురళీకృష్ణ.

హైదరాబాద్, మేడ్చల్ :డిజిటల్ భద్రత, సైబర్ నేరాల నివారణ మరియు ఆన్‌లైన్ సురక్షపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతో స్కిల్ వేద (ఏ ప్రిక్స్ గ్రూపు కంపెనీ) ఆధ్వర్యంలో నిర్వహించిన “సైబర్ సురక్ష– 2026” సైబర్ అవగాహన కార్యక్రమంలో డా. పారువెల్లి అంక విజయ దుర్గ భవాని చురుకుగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమం 2026 జనవరి 3వ తేదీ సాయంత్రం 6.00 గంటల నుండి 8.30 గంటల వరకు నిర్వహించబడింది. సైబర్ సెక్యూరిటీ, సైబర్ క్రైమ్ నివారణ, డిజిటల్ సేఫ్టీతో పాటు సైబర్ చట్టాలపై ప్రాథమిక అవగాహన కల్పించేలా ఈ వర్క్‌షాప్రూ రూపొందించబడింది.కార్యక్రమంలో పాల్గొన్నందుకు గాను డా. పారువెల్లి అంక విజయ దుర్గ భవాని కి సర్టిఫికేట్ ఆఫ్ పార్టిసిపేషన్ అందజేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, నేటి డిజిటల్ యుగంలో ప్రతి పౌరుడు సైబర్ భద్రతపై అవగాహన కలిగి ఉండటం అత్యంత అవసరమని పేర్కొన్నారు.సమాజ హితం, ప్రజా అవగాహన కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే ఆమె ఇటువంటి సైబర్ సురక్ష కార్యక్రమాల్లో పాల్గొని నేర్చుకున్న అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమానికి ప్రమీల్ అర్జున్ (స్పీకర్ & ట్రైనర్), సందీప్ అవుటపల్లి (మెంటర్) తదితరులు మార్గనిర్దేశం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *