తేది:5-1-2026 TSLAWNEWS మెదక్ జిల్లా మెదక్ మండలం రిపోర్టర్ శివలింగం ఎల్లం.
మెదక్ జిల్లా : మెదక్ పట్టణములోని 23,24 వార్డులు అంధకారం ఉన్నాయని ఒక్కసారైనా మున్సిపల్ కమిషనర్ సిబ్బంది ఈ వార్డులలో పర్యవేక్షణ చేయకపోవడం పలుమార్లు కమిషనర్ దృష్టి తీసుకువచ్చిన పట్టించుకోకపోవడం లెధు అని బీజేవైఎం మెదక్ జిల్లా అధ్యక్షులు సతీష్ పటేల్ ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు చేశారు. మెదక్ పట్టణంలోని ముత్యాలమ్మ దేవాలయం వెనక ఉన్న కూడలిలో 24వ వార్డ్ 23వ వార్డు మధ్యలో ఉన్న ఐమాక్స్ లైట్ గత కొన్ని నెలలుగా నిరుపయోగంగా ఉన్నాయనిఅప్పటి కౌన్సిలర్లు ప్రజా ప్రతినిధులు ప్రజల సమస్యలు పట్టించుకోలేదని ఐమాక్స్ లైట్ వెలగకపోవడం వల్ల రాత్రివేళలో మహిళలు చిన్నారులు వృద్ధులు ఇబ్బందుల గురయ్యారని ఆయన మండిపడ్డారు.రద్దీగా ఉండే ప్రదేశం కావున చిన్న పిల్లలకి ప్రమాదాలు జరగడం చీకటి వలన దొంగతనాలు జరగడం జరుగుతున్నాయని అన్నారు. కావున ఐమాక్స్ లైట్లను వెంటనే మరమ్మత్తులు చేయాలని డిమాండ్ చేశారు చీకటిలో ఉన్న బస్తీని వెలుగులోకి తీసుకురావాలని కోరారు. కార్యక్రమం లో బీజేపీ టౌన్ అధ్యక్షులు నాయిని ప్రసాద్ గారు, ఓబీసీమోర్చా అధ్యక్షులు గడ్డం కాశీనాద్ 23,24 వార్డ్ ప్రజలు పాల్గొన్నారు..