మైనార్టీల ఆర్థికాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది మెదక్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు హఫీజ్ మొల్సబ్.

తేది:5-1-2026 TSLAWNEWS మెదక్ జిల్లా మెదక్ మండలం రిపోర్టర్ శివలింగం ఎల్లం.

మెదక్ జిల్లా : తెలంగాణ రాష్ట్రంలోని మైనార్టీల అభ్యున్నతే ధ్యేయంగా ప్రభుత్వం రెండు కీలక పథకాలను పునఃప్రారంభించిందని జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు హఫీజ్ మొల్సబ్ సాబ్ పేర్కొన్నారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనార్టీ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా అందుబాటులో ఉన్న అవకాశాలను వివరించారు.
ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన: వితంతువులు, విడాకులు పొందిన మహిళలు మరియు అవివాహిత, మహిళలు తమ సొంత వ్యాపారం ప్రారంభించుకోవడానికి రూ. 50,000/- ఆర్థిక సహాయం.
మోపెడ్ వాహనాల పంపిణీ: ఫకీర్ మరియు దూదేకుల వర్గాల వారికి జీవనోపాధి కోసం మోపెడ్ వాహనం కొనుగోలుకు రూ. 1,00,000/- (ఒక లక్ష రూపాయలు) రాయితీ.
ముఖ్య గమనిక: అర్హులైన వారందరూ ఈ నెల 5వ తేదీ నుండి 10వ తేదీ వరకు ఆన్‌లైన్ (Online) లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. తక్కువ సమయంలోనే ఈ అవకాశం ముగుస్తుంది కావున మైనార్టీ సోదరీసోదరులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *