జగిత్యాల ఈవీఎం గోదాము తనిఖీ చేసిన జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్.

తేది:05-01-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.

జగిత్యాల జిల్లా : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ప్రతినెల ఈవీఎం గోదాము తనిఖీ లో భాగంగా సోమవారం రోజున జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ దరూర్ క్యాంప్ లో గల గోదాములోని ఈవీఎంలను భద్రపరిచిన యంత్రాల భద్రత, సిసి కెమెరాల పనితీరు మరియు సాంకేతికపరమైన అంశాలను సమగ్రంగా పరిశీలించారు.
గోదాము వద్ద ఎలాంటి లోపాలు లేకుండా పటిష్టమైన భద్రత ఉండాలని, నిత్యం అప్రమత్తతో పర్యవేక్షించాలని సిబ్బందికి సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవిన్యూ) బి.ఎస్.లత , జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు కలెక్టరేట్ ఏ.వో హకీమ్, జగిత్యాల అర్బన్ ఎమ్మార్వో రామ్మోహన్ మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *