ఎర్రవల్లి ప్రాథమిక పాఠశాలలో శిక్షణ ఫౌండేషన్ రెండో విడత కార్యచరణ బుక్స్ పంపిణీ-వికారాబాద్ మెంటార్ లక్ష్మీనారాయణ.

తేది:05-01-2026 వికారాబాద్ జిల్లా TSLAWNEWS వికారాబాద్ మండలం రిపోర్టర్ లక్ష్మీనారాయణ గొల్ల.

వికారాబాద్ జిల్లా: వికారాబాద్ మండలం లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఎర్రవల్లి లో శిక్షణ ఫౌండేషన్ సంస్థ వారు రెండవ విడత కార్యచరణ పుస్తకాలను పంపిణీ చేయడం జరిగింది. శిక్షణ ఫౌండేషన్ వికారాబాద్ జిల్లాలో 2019 నుంచి ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల పునాది స్థాయి సామర్ధ్యాలను పెంపొందించడం కోసం, విద్యార్థులలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడం, పాఠశాల విద్యలో తల్లిదండ్రుల భాగస్వామ్యం పెంచడం, బాధ్యతాయుతమైన సమాజాన్ని తయారు చేయడం కోసం కృషి చేస్తుంది. ఈ కార్యక్రమంలో శిక్షణ ఫౌండేషన్ మెంటర్ లక్ష్మీనారాయణ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుజాత ,ఉపాధ్యాయులు శ్రీనివాస్ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ మెంబర్ మధుమతి గారు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *