చైనా మాంజా ను ఉపయోగిస్తే చట్ట ప్రకారం చర్యలు-ఎస్సై శంకర్.

తేది:5- 01- 2026 మెదక్ జిల్లా TSLAWNEWS అల్లాదుర్గం మండల్ రిపోర్టర్ వి పాపయ్య చారి.

మెదక్ జిల్లా : అల్లాదుర్గం మండలం లో పలు గ్రామంలో సంక్రాంతి పండుగకు గాలి పటాల తో పాటు పక్షులను ఎగరనిద్దామని చైనా మాంజా తో తలెత్తే అనర్థాల పై అందరికి అవగాహన కలిగి ఉoడాలి గాలి పటాలు ఎగరడం కోసం వినియోగించే చైనా మాంజ లకు పూత పూసిన నైలాన్, సింథటిక్ దారాలు పక్షులకు, పర్యావరణానికి, మనుషులకు హాని చేస్తాయి. జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాలను అనుసరించి రాష్ట్రంలో చైనా మాంజా వినియోగాన్ని పూర్తిగా నిషేధించడం జరిగింది ,ఈ యొక్క చైనా మాంజా ను నిల్వచేసిన, రవాణా చేసిన చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై శంకర్ హెచ్చరించారు. సెక్షన్ ఎస్ ఇ సి 223,125 బి ఎన్ ఎస్ మరియు ఎస్ ఇ సి 5,15 పర్యావరణ పరిరక్షణ చట్టం కింద కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. ఈ యొక్క చైనా మాంజా ను ఎవరైనా తయారు చేసిన లేదా అమ్మినా, రవాణా చేసినా సమాచారం ఉంటే సంబంధిత పోలీస్ స్టేషన్ లకు గాని డయల్ 100 గాని ఫోన్ చేసి తెల్పాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *