
తేది:04-01-2026 భూపాలపల్లిజిల్లా TSLAW NEWS గణపురం మండలం రిపోర్టర్ దీపక్ పటేల్ పుప్పాల.
భూపాలపల్లి జిల్లా: గణపురం మండల కేంద్రానికి చెందిన అయ్యప్ప మాలధారణ భక్తులు ఇరుముడులు కట్టుకొని శబరిమలై అయ్యప్ప స్వామి సన్నిధికి బయలుదేరారు. మండల దీక్ష చేపట్టిన మాలాధారణ భక్తులు గురు స్వామి యామ సుధీర్ ఆధ్వర్యంలో ఆదివారం మండల కేంద్రంలోని శ్రీ పట్టాభి సీతా రామచంద్రస్వామి దేవాలయంలో గురు స్వామి కరుణాకర్ చేతుల మీదుగా 30 మంది ఇరుముడులను కట్టుకున్నారు. అనంతరం అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాలాధారణ భక్తులకు కుటుంబ సభ్యులు బంధువులు ఘనంగా వీడ్కోలు పలికారు. అనంతరం ఇరుముడులతో పురవీధులగుండా అయ్యప్ప నామస్మరణ చేస్తూ ఊరేగింపు నిర్వహించారు.