రాములవారి తాళంబ్రాలలకు వినియోగించు వడ్ల పూజ భద్రాచలం లో ఘనంగా జరిగింది.

తేది:04-01-2026 భూపాలపల్లి జిల్లా TSLAWNEWS గణపురం మండలం రిపోర్టర్ దీపక్ పటేల్ పుప్పాల.

భూపాలపల్లి జిల్లా: గణపురం మండలం భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి జన్మ నక్షత్రం పునర్వసు సందర్భంగా భద్రగిరి లో శ్రీరామదాసు భక్త మండలి చెల్పూర్ వారి కోటిగోటి తలంబ్రాలు తయారీకి వినియోగించే వడ్ల పూజా కార్యక్రమం భక్త రామదాసు ట్రస్ట్ కొత్తగూడెం వారి గిరి ప్రదక్షణ కార్యక్రమం భక్తుల కోలాటాలు రామనామ స్మరణ నడుమ వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ ఆలయ ఈవో దామోదర్ రావు ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి కార్యక్రమంలో భక్త రామదాసు పదవతరం వారసులు కంచర్ల శ్రీనివాసరావు దంపతులు రామదాసు భక్తమండలి వ్యవస్థాపక అధ్యక్షులు రామదాసు తిరుపతి దంపతులు ఆలయ ఏఈవోలు సాయిబాబా, శ్రావణ్ కుమార్ మురళికృష్ణమాచార్యులు, రామకృష్ణ ప్రసాద్ ఆచార్యులు వేద పండితులు ఆలయ సిబ్బంది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ పూజ జరిపించిన వడ్లను గోటితో ఒలవడానికి సంక్రాంతి తర్వాత భక్తులకు పంపిస్తామని అనంతరం భద్రాచలంలో శ్రీరామనవమి నాడు జరిగే రాములవారి కళ్యాణం కొరకు వినియోగిస్తామని రామదాసు తిరుపతి పేర్కొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *