
తేది:04-01-2025 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS చీప్ అడ్వైజర్ ఎర్ర శ్రీహరి గౌడ్.
సంగారెడ్డి పట్టణం లో జరిగిన తెలంగాణ ఆదివాసీ కాంగ్రెస్ బునియాది కార్యకర్త సమ్మేళనం లో పిలుపునిచ్చిన-టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి.
సంగారెడ్డి లో గిరిజన కార్పొరేషన్ చైర్మెన్ , నేషనల్ ఆదివాసీ కాంగ్రెస్ వైస్ చైర్మన్ బెల్లయ్య నాయక్ ఆధ్వర్యం లో ఆదివాసీ కాంగ్రెస్ కార్యకర్తల శిక్షణా తరగతులు.
సంగారెడ్డి జిల్లా: ఆదివాసీ కార్యకర్తలు, నాయకుల దేశ వ్యాప్త శిక్షణా తరగతుల్లో భాగంగా శనివారం ఉమ్మడి మెదక్ జిల్లా శిక్షణా తరగతులు సంగారెడ్డి పట్టణం లోని పిఎస్సార్ గార్డెన్ లో జరిగాయి. గిరిజన కార్పొరేషన్ చైర్మన్, నేషనల్ ఆదివాసీ కాంగ్రెస్ వైస్ చైర్మన్ బెల్లయ్య నాయక్ ఆధ్వర్యం లో ఈ శిక్షణా తరగతులు జరిగాయి. మూడు రోజుల పాటు జరిగే శిక్షణా తరగతులకు మొదటి రోజు టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ
మహిళలకు యాభై శాతం స్థానం ఉండాలని ఇకముందు ఎక్కడ శిక్షణ తరగతులు ఏర్పాటుచేసిన మహిళలను ఉండేలా చూడాలని అన్నారు .త్వరలో జిల్లా కమిటీలు ఏర్పాటు చేసే అవకాశం ఉందని అందులో కూడా 30 మంది మహిళలు ఉండేలా చూడాలని పది మంది ఎస్సీ ,ఎస్టీ మహిళలకు అవకాశం దక్కేలా నిర్ణయం తీసుకోవాలని అన్నారు.
మెదక్ జిల్లాకు ఒక చరిత్ర ఉందని ఇందిరాగాంధీని ఎంపీగా గెలిపించి దేశానికి ప్రధానిని అందించిన జిల్లా మెదక్ అన్నారు.
ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఆడజన్మ రాదని అలాంటి ఆడవారిని అప్పటి కాలంలో అనేక కట్టుబాటులకు గురిచేసి బందీ చేశారని చదువుకు దూరం చేసి సతీసహగమనం వంటి దురాచారాలను అమలు చేసే వారిని కానీ నేటి సమాజంలో మహిళలు పురుషులకు సమానంగా ఇంకా ఎక్కువే ముందున్నారని కలెక్టర్లు అవుతున్నారని అనేక పదవులలో వారు ముందుంటున్నారు. అంటే దీనంతటికీ కారణం సావిత్రిబాయి పూలే అని గుర్తు పెట్టుకోవాలన్నారు. ఎన్నో అవమానాలు ఆటంకాలను ఎదుర్కొని సమాజ శ్రేయస్సు కోసం పాటుపడిన సావిత్రిబాయి పూలే ను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.
చదువుకుంటేనే సంస్కారం సంపద వస్తాయని ఆమె గుర్తు చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఒక్క వంద నలభై ఒక్క సంవత్సరాలు పూర్తి చేసుకున్న పార్టీ అని ఇప్పుడు ప్రజల కోసమే పాటుపడే పార్టీ కాంగ్రెస్ అన్నారు. ఆదివాసీలను ఆర్థికంగా, సామాజికంగా రాజకీయంగా ఎదిగేలా చేసిన ఘనత ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీది అన్నారు. ఇక్కడో సమాజానికి దూరంగా బ్రతికే వారిని సమాజంలోకి తీసుకొని వచ్చి వారికి అన్ని హక్కులను కల్పించిన ఘనత కాంగ్రెస్‌ది అన్నారు. ఈ శిక్షణా తరగతులను ఆదివాసీలందరు శ్రద్ధగా ఉపయోగించుకోవాలని ఇక్కడ నేర్చుకున్న వాటిని పదిమందికి తెలియజేయాలని ఆమె పేర్కొన్నారు.
నేటి సమాజంలో గాంధీ పేరుని మార్చే వారున్నారని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తిరిగి రాస్తామని నాయకులు ఉన్నారని వారందరినీ తరిమికొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు.
రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసే వరకు కాంగ్రెస్ ప్రతి కార్యకర్త ఓ దీక్షలా ముందుకు సాగాలన్నారు.