తేది:04-01-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS అమీన్‌పూర్ మండలం రిపోర్టర్ రాము రావు చాతరాజు.
సంగారెడ్డి జిల్లా: బీరంగూడ GHMC డివిజన్ పరిధిలోని పవర్ లిఫ్టింగ్ విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలలో ప్రతిభ చాటి విజయం సాధించి, జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారు. ఈ ఘనతతో ప్రాంతానికి గర్వకారణంగా నిలిచిన విద్యార్థులు తమ కోచ్‌తో కలిసి మన ప్రియతమ నాయకులు, తాజా మాజీ ఎంపీపీ ఈర్ల దేవానంద్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.
జాతీయ స్థాయి పోటీలకు అవసరమైన దుస్తులు, షూస్ కోసం ఆర్థిక సహకారం అందించాలని కోచ్ అభ్యర్థించగా, వెంటనే స్పందించిన దేవానంద్ గారు తక్షణమే ₹65,000 నగదు సహాయం అందించి క్రీడాకారులకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రీడల పట్ల అంకితభావం, క్రమశిక్షణతో ముందుకు సాగాలని, తల్లిదండ్రులకు మరియు దేశానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. జాతీయ స్థాయి పోటీల్లో కూడా విజయం సాధించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ ఈర్ల నితీష శ్రీకాంత్ గారు, యువ నాయకులు ఈర్ల ప్రశాంత్ గారు పాల్గొని విద్యార్థులను అభినందించారు. క్రీడా ప్రతిభను ప్రోత్సహించే ఈ సహకారం యువ క్రీడాకారుల్లో మరింత ఉత్సాహాన్ని నింపిందని స్థానికులు ప్రశంసించారు.