యూ రి యా స్టాక్ పట్ల రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దు-ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి. 13,795 మెట్రీ టన్నుల, యూరియా స్టాక్ లభ్యం, రైతులు అవసరానికి మించి యూరియా కొనుగోలు చేయవద్దు.

తేది:3:1-2026 ఖమ్మం జిల్లా TSLAWNEWS వేంసూరు మండలం రిపోర్టర్. మహమ్మద్ బురహానుద్దీన్.

ఖమ్మం జిల్లా: ఖమ్మం జిల్లాలో చింతకాని మండలంలోని నాగులంచ గ్రామంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి శనివారం పర్యటించారు.
చింతకాని మండలంలోని నాగులవంచ గ్రామంలోని వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయం వద్ద యూరియా కేంద్రంలో కొనుగోలు ప్రక్రియను ఆయన పరిశీలించారు. రైతులతో కలెక్టర్ నేరుగా మాట్లాడారు. జిల్లాలో యూరియా సమృద్ధిగా ఉందని రైతుల ఆందోళన చెంద వద్దని అన్నారు. యూరియా రైతులందరికీ పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం మొత్తం 1395 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని అన్నారు. మార్క్ఫెడ్ వద్ద 9736 మెట్రిక్ టన్నులు ఫ్యాక్స్ వద్ద 900 మీటర్లు ప్రైవేట్ డీలర్స్ వద్ద 663 మెట్రిక్ టన్నులు, గతంలో మన దగ్గర ఉన్న సిఆర్పి స్టాక్ 24 95 మెట్రిక్ టన్నులు, అందుబాటులో ఉన్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి 20 ఎకరాల సాగు విస్తరానికి ఒక యూరియా సేల్ పాయింట్ ఉండే విధంగా చర్యలు చేపట్టామని అన్నారు. యూరా కోసం రైతులు ఏ సమయంలో రావాలో వారికి ముందుగానే సమాచారం అందిస్తూ కూపన్లు కూడా జారీ చేస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అవసరమైన మేర యూరియా అందుబాటులో ఉందని రైతులు అధికారులు సహకరిస్తూ వారు సూచించిన సమయంలో వచ్చి యూరియా తీసుకొని వెళ్లాలని కలెక్టర్ తెలిపారు. ఒక రైతు అతని సాగు విస్తడానికి అవసరమైన యూరా తప్పకుండా ఇస్తామని దానికంటే అధికంగా యూరియా తీసుకొని వెళ్లకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. రైతులు ఎవరూ ప్రస్తుత అవసరానికి మించి యూరియా కొనుగోలు చేయవద్దని కలెక్టర్ రైతులకు సూచించారు. ఈ పాటలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య, జిల్లా సహకార అధికారి గంగాధర్ మధిర వ్యవసాయ సంచాలకులు, చింతకాయతో తాసిల్దార్ బాబ్జి ప్రసాద్, నాగులంచ పిఎసిఎస్ సీఈవో, యా లమూడి శ్రీనివాసరావు, ఏఈఓ దార గాని కళ్యాణి, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *