
తేది:3-1-2026 ఖమ్మం జిల్లా TSLAWNEWS వేంసూరు మండలం రిపోర్టర్ మహమ్మద్ బురహానుద్దీన్.
ఖమ్మం జిల్లా: కొనిజర్ల మండలంలోని పెద్దగోపతి గ్రామ పంచాయతీలో మిషన్ భగీరథ ఆపరేటర్ నిర్లక్ష్యం వల్లవాటర్ ట్యాంకర్. నిండి పోయి సుమారు పది ఎకరాల మొక్కజొన్న తోట తడిచే అంత నీళ్ళు వృధాగా పోతున్నప్పటికీ, ఈ విషయాన్ని ఎన్నోసార్లు అధికారులకు చెప్పినకూడా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని, ఆపరేటర్ పై తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. మిషన్ భగీరథ నీళ్లు ఓవర్ ఫ్లోఐ, మిషన్ భగీరథ పెద్దగోపతి గ్రామపంచాయతీలో పెద్ద వాటర్ ట్యాంకు దగ్గర ఎస్సీ స్మశాన వాటికలో తీసిన సుమారు యాభై లక్షలు రూపాయలతో అక్రమంగా తీసిన గుంట నిండిపోయి, పది ఎకరాలకు సరిపడా తాగునీరు వృధాగా పోతున్నాయని గ్రామ ప్రజలు నీటి సమస్యపై తగుచర్యలు తీసుకో వాలని వినతిపత్రాలు అధికారులకు అందజేశారు. అందజేసినప్పటికీ ఫలితం కనిపించకపోవడంతో ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ని ఆపరేటర్. పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.