
తేది: 3- 01- 2026 మెదక్ జిల్లా TSLAW NEWS అల్లాదుర్గం మండల రిపోర్టర్ పాపయ్య చారి.
మెదక్ జిల్లా,రేగోడ్ మండలం: ఆరే ఇటిక్యాల గ్రామం లో ఏర్పాటు చేసిన శ్రీ శ్రీమద్రామడుగు శివరామ దీక్షితుల అచల గురు సాంప్రదాయకులు అచల పరిపూర్ణులు నిర్గుణానంద నాగభూషణ దేశికేందుల పాదపూజ శనివారం మయ బ్రహ్మ శివరాములు దేశి కేంద్రుల దంపతులచే వారి స్వగృహములో ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున 5 నుండి మేలుకొలుపులు 6 గంటల గురు గీతా పారాయణం 11 గంటలకు అచల జెండా ఆవిష్కరణ అఖండ గురు పాదుకాపూజ తదనంతరం తీర్థ ప్రసాదం అన్నదాన ప్రసాదం చేశారు. సాయంత్రం అచల పరిపూర్ణులకు సన్మానం వేదాంత మహాసభ అచల పరిపూర్ణులు కాశీనాథ్ ఆర్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దలు కిషన్ ఆర్యులు, శ్రీశైలం ఆర్యులు, నరసింహ గౌడ్ ఆర్యులు, నారాయణ, ఆర్యులు, గురు భక్తాదులు తదితరులు పాల్గొన్నారు.