హెచ్-1బీ వీసా పునరుద్ధరణ ప్రక్రియను మరింత సౌకర్యవంతంగా చేసేందుకు అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా H-1B వీసాల యొక్క కొన్ని వర్గాలను పునరుద్ధరించే పైలట్ ప్రోగ్రామ్ డిసెంబర్‌లో ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమం 3 నెలల పాటు అందుబాటులో ఉంటుందని వీసా సేవల డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ జూలీ స్టఫ్ తెలిపారు. ఈ పైలట్ ప్రోగ్రామ్ కింద మొదటి 20,000 మందికి వీసా రెన్యూవల్ చేయనున్నారు.