తేది:3-01- 2026 TSLAWNEWS మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ పారువెల్లి దుర్గ భవాని.
సెక్రటేరియట్, హైద్రాబాద్:రామగుండం శాసనసభ్యులు శ్రీ రాజ్ ఠాకూర్ ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి, విశ్వ బ్రాహ్మణ సమాజానికి సంబంధించిన పలు కీలక సమస్యలు, వారి జీవనోపాధి పరిరక్షణకు సంబంధించిన అంశాలపై వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా విశ్వ బ్రాహ్మణ సమాజం సామాజిక–ఆర్థికంగా అభివృద్ధి సాధించే దిశగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ముఖ్యంగా విశ్వ బ్రాహ్మణల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, ప్రభుత్వ పరిధిలో సమాజ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయాలని వినతిపత్రంలో విజ్ఞప్తి చేశారు.
పూస్తే మట్టెలు తయారీ హక్కులను పూర్తిగా స్వర్ణ కారులకే పరిమితం చేయాలని, నగల దుకాణాల్లో సిద్ధంగా విక్రయించే విధానం వల్ల స్వర్ణ కారులకు ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయని పేర్కొన్నారు. ఈ పనులు పూర్తిగా స్వర్ణ కారుల ద్వారానే నిర్వహించబడేలా ప్రభుత్వం తగిన విధానాలు రూపొందించి అమలు చేయాలని వినతిపత్రంలో స్పష్టం చేశారు.
వినతిపత్రాన్ని స్వీకరించిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గఅంశాలపై సానుకూలంగా స్పందించినట్లు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ రాజ్ ఠాకూర్ తెలిపారు.